nampally: లంచం తీసుకున్న నాంపల్లి మెట్రోపాలిటన్ జడ్జి అరెస్టు

  • డ్రగ్స్ కేసులో నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు లంచం డిమాండ్
  • రూ.7 లక్షల 50 వేలు లంచం తీసుకున్న జడ్జి రాధాకృష్ణమూర్తి
  • ఆధారాలు సేకరించి జడ్జిని అరెస్టు చేసిన ఏసీబీ

డ్రగ్స్ కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకున్న విషయమై నాంపల్లి మెట్రో పాలిటన్ జడ్జి రాధాకృష్ణమూర్తిని ఏసీబీ అరెస్టు చేసింది. నిందితుడు దత్తుకు బెయిల్ ఇచ్చే నిమిత్తం రూ.7 లక్షల 50 వేలు లంచం తీసుకున్న ఆరోపణలపై ఆయన్ని అరెస్టు చేశారు. రాధాకృష్ణమూర్తితో పాటు మరో ఇద్దరు న్యాయవాదుల్ని కూడా అరెస్టు చేశారని సమాచారం.

కాగా, నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు మొదట పదకొండు లక్షల రూపాయలు కావాలని రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేసినప్పటికీ, రూ.7 లక్షల 50 వేలకు సెటిల్ చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని గాంధీనగర్ లోని రాధాకృష్ణమూర్తి నివాసంలో ఏసీబీ సోదాలు చేయడంతో ఆధారాలు లభించాయి. కాసేపట్లో ఆయన్ని రిమాండ్ కు తరలించనున్నట్టు సమాచారం.

More Telugu News