bahubali: 'బాహుబలి'కి ప్రకటించిన జాతీయ అవార్డుపై నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం

  • 'బాహుబలి-2' యాక్షన్ డైరెక్టర్ అబ్బాస్ అలీకి అవార్డు ప్రకటించిన జ్యూరీ
  • అబ్బాస్ అలీ ఎవరంటూ ప్రశ్నించిన నిర్మాత శోభు
  • యాక్షన్ డైరెక్టర్ గా పీటర్ హెయిన్ పని చేశారంటూ ట్వీట్

65వ జాతీయ ఉత్తమ చలనచిత్ర అవార్డులను అధికారికంగా ప్రకటించారు. జ్యూరీకి నాయకత్వం వహిస్తున్న దర్శకుడు శేఖర్ కపూర్ ఈ అవార్డులను ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో ప్రకటించారు. ఈ అవార్డుల్లో తెలుగు చిత్రాలకు కూడా స్థానం లభించింది. రానా నటించిన 'ఘాజీ' చిత్రానికి బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డు దక్కింది. ఇదే సమయంలో 'బాహుబలి-2'కి మూడు అవార్డులు లభించాయి.

ఇంతవరకు బాగానే ఉంది కానీ... ఇక్కడే జ్యూరీ అతిపెద్ద పొరపాటు చేసింది. 'బాహుబలి-2' సినిమా యాక్షన్ డైరెక్టర్ అబ్బాస్ అలీ మొఘల్ ను బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా ప్రకటించింది. దీనిపై ఈ సినిమా నిర్మాత యార్లగడ్డ శోభు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబ్బాస్ అలీ మొఘల్ ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. 'బాహుబలి-1', 'బాహుబలి-2' ఈ రెండు సినిమాలకు ఆయన పని చేయలేదని చెప్పారు. యాక్షన్ డైరెక్టర్ గా పీటర్ హెయిన్ పని చేశారని ట్వీట్ చేశారు.

దీని తర్వాత ఆయన మరో ట్వీట్ చేశారు. తమ టీమ్ చేసిన కృషిని గుర్తించి... బెస్ట్ పాప్యులర్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలకు అవార్డులను ప్రకటించినందుకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News