nani: తొలిరోజున 'కృష్ణార్జున యుద్ధం' వసూళ్లు

  • నిన్ననే విడుదలైన 'కృష్ణార్జున యుద్ధం'
  • నాని ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణ 
  • వీకెండ్ లో వసూళ్లు పెరిగే ఛాన్స్       

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన 'కృష్ణార్జున యుద్ధం' నిన్ననే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు .. ఓవర్సీస్ లోను నానికి మంచి క్రేజ్ వుంది. ఆయన సినిమాల్లో మంచి కంటెంట్ వుంటుందనే నమ్మకం వుంది.

అందువలన ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది. తొలిరోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. ఈ వీకెండ్ లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం వుంది. ఒక వైపున 'రంగస్థలం' జోరు కొనసాగుతూ ఉండగా ఈ సినిమా థియేటర్స్ కి రావడం ఒక విశేషమైతే, 'భరత్ అనే నేను' మూవీకి కొన్ని రోజుల ముందుగా ప్రేక్షకుల ముందుకు రావడం మరో విశేషం. మరి ఈ స్టార్ హీరోల మధ్య ఆశించిన స్థాయిలో నాని వసూళ్లు రాబడతాడేమో చూడాలి.    

More Telugu News