నీలాంటి అధమ స్థాయి వ్యక్తులకు సమాధానం చెప్పను: నెటిజన్ పై సానియా మీర్జా ఫైర్

- నీవు ఇండియన్ కాదన్న నెటిజన్
- నేను ఎప్పటికీ భారతీయురాలినే అన్న సానియా
- ఎవరైనా ఏ దేశస్తుడినైనా పెళ్లి చేసుకోవచ్చన్న టెన్నిస్ స్టార్
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ, 'సానియా మీరంటే నాకు ఎంతో గౌరవం. మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. పాక్ వ్యక్తిని పెళ్లాడిన మీరు ఇండియన్ కాదు. ఒకవేళ మీరు ట్వీట్ చేయాలనుకుంటే.... పాక్ ఉగ్రమూకలు చంపుతున్న అమాయకుల గురించి ట్వీట్ చేయండి' అని కామెంట్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై సానియా మండిపడింది. ఒక వ్యక్తి ఏ దేశానికి చెందిన వ్యక్తినైనా పెళ్లి చేసుకోవచ్చని చెప్పింది. తాను ఇండియా కోసమే ఆడతానని... ఎప్పటికీ ఇండియన్ గానే ఉంటానని తెలిపింది. తాను ఏ దేశస్తురాలో నీలాంటి అథమ స్థాయి వ్యక్తులకు చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించింది.