mark zuckerberg: ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ ను ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్లు

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డేటా లీక్
  • అమెరికా కాంగ్రెస్ ముందు వాదనలు వినిపించిన జుకర్ బర్గ్
  • మార్క్ పై పేలుతున్న జోకులు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. 8 కోట్ల 70 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఇచ్చారనే ఆరోపణలపై... ఆయనను వృద్ధులు ఎక్కువగా వుండే అమెరికా సెనేట్ కమిటీ విచారించిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా సెనేటర్లు అడిగిన విచిత్రమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక జుకర్ బర్గ్ నీళ్లు నమిలారు. ఈ సందర్భంగా సెనేటర్లకు ఫేస్ బుక్ అంటే అవగాహన లేదని, అందుకే అలాంటి ప్రశ్నలు అడిగారని అన్యాపదేశంగా పేర్కొంటూ, నెటిజన్లు జుకర్ బర్గ్ పై జోకులు పేలుస్తున్నారు. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి.

  • జుకర్ బర్గ్... గత పదేళ్లుగా నేను ఫేస్ బుక్ లో ఉన్నా. నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఒక్కరు కూడా ఎందుకు స్వీకరించలేదో చెప్పండి
  • జుకర్ బర్గ్... నా ఫామ్ హౌస్ లో పందులు పెంచాలనుకుంటున్నా. కానీ వాటిని ఎక్కడ కొనాలో తెలియడం లేదు. మీరు సలహా ఇవ్వండి.
  • నా మనవడు నా ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఎందుకు ఆమోదించడం లేదో కారణం చెప్పండి.

More Telugu News