anam vivekananda reddy: ఆందోళనకరంగా ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి

  • కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆనం
  • ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్న డాక్టర్లు
  • పరామర్శించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్నారు. హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో, ఆయనకు వైద్యులు ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కిమ్స్ కు వచ్చి ఆయనను పరామర్శించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు ఉన్నారు.

More Telugu News