Andhra Pradesh: 16న ఏపీ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది!: రఘువీరారెడ్డి

  • 'హోదా' కోసం పోరాటాలు ఉద్ధృతం 
  • కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసనలు
  • పార్టీలన్నీ పాల్గొంటున్నాయి
  • మోదీ దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం హోదా సాధన సమితి ఈ నెల16న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ సంపూర్ణ మ‌ద్ద‌తు తెలుపుతున్నట్లు ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ప్రకటించారు. ఈ మేర‌కు విజయవాడలోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

"ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం పోరాటాలు ఉద్ధృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే హోదా సాధ‌న స‌మితి  బంద్‌కు పిలుపు నిచ్చింది. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్ కు దిగుతున్నామని సాధన సమితి నాయ‌కులు తెలిపారు. ప్రధానమంత్రి దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది" అని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

More Telugu News