chada venkat reddy: ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు మౌనంగా ఉన్నారు?: వెంకయ్యనాయుడిపై తెలంగాణ నేత ఆగ్రహం

  • ప్రత్యేక హోదాపై కేంద్రం మాట తప్పింది
  • 16న జైల్ భరో కార్యక్రమం చేపట్టనున్నాం
  • మోదీ, కేసీఆర్ లకు ప్రజా సంక్షేమం పట్టలేదు

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. ఇంత జరుగుతున్నా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై సీపీఐ మొదటి నుంచి కూడా ఒకే స్టాండ్ పై ఉందని తెలిపారు. ఈ రోజు ఏపీకి ప్రత్యేకహోదాపై ఉస్మానియా యూనివర్శిటీలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీపీఐ నారాయణ, కోదండరామ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న తాము జైల్ భరో కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రజా సంక్షేమం పట్టలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ ఇతర ప్రాజెక్టులపై చూపడం లేదని కేసీఆర్ పై మండిపడ్డారు.

More Telugu News