nagachaitanya: చైతూ తాజా చిత్రం కోసం నాగ్ హిట్ సాంగ్ రీమిక్స్

  • షూటింగు దశలో 'సవ్యసాచి'
  • దర్శకుడిగా చందూ మొండేటి 
  • 'అల్లరి అల్లుడు'లోని సాంగ్ రీమిక్స్

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీస్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం నాగ్ హిట్ సాంగ్స్ లో ఒకటి రీమిక్స్ చేయనున్నట్టు సమాచారం.

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'అల్లరి అల్లుడు' ఒకటి. 1993లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో 'నిన్ను రోడ్డుమీద చూసినది లగ్గాయితు' అనే సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. కీరవాణి స్వరపరచిన ఈ పాటను .. 'సవ్యసాచి' కోసం రీమిక్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా కీరవాణి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ఈ రీమిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారట.      

More Telugu News