nani: 'కృష్ణార్జున యుద్ధం' యూఎస్ ప్రీమియర్ షో టాక్!

  • కృష్ణ - అర్జున్ పాత్రల్లో నాని 
  • కృష్ణ పాత్రకి ఎక్కువ మార్కులు 
  • పాటలు .. కామెడీ ప్రత్యేక ఆకర్షణ  

నాని కథానాయకుడిగా దర్శకుడు మేర్లపాక గాంధీ 'కృష్ణార్జున యుద్ధం' సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఈ రోజునే ఇక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో ఈ సినిమా టాక్ బయటికి వచ్చేసింది. ఈ సినిమాలో నాని కృష్ణ .. అర్జున్ అనే రెండు పాత్రలను పోషించాడు. కృష్ణ గా మాస్ ఏరియా కుర్రాడి పాత్రలోను .. అర్జున్ గా 'రాక్ స్టార్' పాత్రలోను నాని ఇమిడిపోయాడని చెబుతున్నారు.

ఈ రెండు పాత్రల్లో కృష్ణ పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనీ, ఈ పాత్రలో చిత్తూరు యాసలో నాని అదరగొట్టేశాడని అంటున్నారు. వైవిధ్యభరితమైన ఈ రెండు పాత్రల్లోను నాని నటన అద్భుతమనీ .. రెండు పాత్రలకి ఆయన న్యాయం చేశాడని  చెబుతున్నారు. కథాకథనాలతో పాటు పాటలు .. కామెడీ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.     

More Telugu News