Taj Mahal: కుండపోత వర్షానికి కుప్పకూలిన తాజ్ మహల్ మినార్!

  • కూలిన దర్వాజా - ఏ - రౌజా
  • గురువారం అర్థరాత్రి దాటిన తరువాత ఘటన
  • 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు

గత రాత్రి ఆగ్రాలో కురిసిన భారీ వర్షానికి ప్రముఖ పర్యాటక క్షేత్రం తాజ్ మహల్ లో ఓ మినార్ కుప్పకూలింది. తాజ్ మహల్ ప్రవేశ ద్వారానికి ఉన్న 12 అడుగుల లోహపు పిల్లర్ (దీన్ని దర్వాజా - ఏ - రౌజాగా పిలుస్తారు) కూలిపోయిందని అధికారులు వెల్లడించారు.

దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు మినార్ కూలిపోయి ముక్కలు ముక్కలైందని, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగిందని తాజ్ మహల్ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఏఎస్ఐ (ఆర్కియోలాజికల్ సొసైట్ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. మినార్ పైన అమర్చిన కలశం సహా అన్ని ముఖ్యమైన భాగాలనూ భద్రపరిచినట్టు తెలిపింది.  

More Telugu News