america: 'సిరియా మీదకు మిస్సైళ్లు వదులుతున్నాం'.. రష్యాను తీవ్రంగా హెచ్చరించిన ట్రంప్‌

  • మరోసారి ట్రంప్ కలకలం రేపే ప్రకటన
  • సిరియా విషపూరిత వాయువులను ప్రయోగిస్తుదంటూ ఫైర్‌
  • రష్యా ఎందుకు సపోర్ట్ చేస్తోందని ప్రశ్న

సిరియాపై తాము కొత్త, స్మార్ట్ మిస్సైళ్లను ప్రయోగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ట్వీట్ చేసి కలకలం రేపారు. విషపూరిత వాయువులను ప్రయోగిస్తూ సొంత ప్రజలను చంపుతూ, ఎంజాయ్‌ చేస్తోన్న అసద్ (సిరియా అధ్యక్షుడు) అనే మృగం లాంటి వ్యక్తికి రష్యా అండగా నిలుస్తుందా? అని ట్రంప్ నిలదీశారు. తమ ప్రణాళికలను మాత్రం చెప్పలేమని అన్నారు. కాగా, సిరియా సర్కారు పాల్పడుతోన్న చర్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అండగా ఉంటుండం పట్ల ట్రంప్ మొదటి నుంచి మండిపడుతున్నారు.

ఇటీవల సిరియాలోని దౌమాలో రసాయనిక దాడి జరిగింది. దీనికి ప్రతీకారంగానే సిరియాపై దాడి చేయాలని ట్రంప్ యోచిస్తున్నారు. ట్రంప్ ప్రకటనపై స్పందించిన లెబనాన్‌కు చెందిన రష్యా అంబాసిడర్.. సిరియా మీదకు వచ్చే ఎటువంటి క్షిపణినైనా ధ్వంసం చేస్తామని పేర్కొన్నారు.

More Telugu News