prabhudeva: 'మెర్క్యురీ' చిత్రాన్ని మెచ్చిన 'అర్జున్ రెడ్డి' దర్శకుడు

  • సైలెంట్ థ్రిల్లర్ గా 'మెర్క్యురీ'
  • కార్తీక్ సుబ్బరాజు పనితీరు అద్భుతం
  • నిజంగానే ఇది ఒక ప్రయోగం      

తమిళ దర్శకులలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వాడిగా కార్తీక్ సుబ్బరాజు కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా 'మెర్క్యురీ' రూపొందింది. ప్రభుదేవా ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను .. ఇతర భాషల్లోను ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది.

సైలెంట్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా .. ఎలాంటి సంభాషణలు లేకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పైనే నడుస్తుంది. కెమెరా పనితనంతోనే భయపెడుతుంది. అలాంటి ఈ సినిమా స్పెషల్ షోను 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా చూశాడట. సినిమా కొత్తగా .. చాలా బాగుందని ఆయన కితాబు ఇచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు అద్భుతంగా తీశాడనీ .. సాంకేతిక పరిజ్ఞానం ఆశ్చర్యపరుస్తుందని చెప్పాడు. ఇదొక ప్రయోగమనీ .. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు.   

More Telugu News