nani: నాని మూవీపై అందరిలో పెరుగుతోన్న ఆసక్తి

  • భారీ వసూళ్లతో 'రంగస్థలం'
  • అడ్డుకట్ట వేయలేకపోయిన 'ఛల్ మోహన్ రంగ'
  • రంగంలోకి దిగుతోన్న నాని  

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని చేసిన 'కృష్ణార్జున యుద్ధం' ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలపైనే చాలామంది ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమా 'రంగస్థలం' .. వసూళ్లపై ఎంతవరకూ ప్రభావం చూపనుందనేది చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను 'రంగస్థలం' కొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతోంది.

 ఆ తరువాత వచ్చిన 'ఛల్ మోహన్ రంగ' .. 'రంగస్థలం' దూకుడును ఎంతమాత్రం తగ్గించలేకపోయింది. తొలిరోజునే మిక్స్డ్ టాక్ తెచ్చుకుని ఓ మాదిరి వసూళ్లను సాధిస్తోంది. ఈ నేపథ్యంలోనే నాని 'కృష్ణార్జున యుద్ధం' రేపు విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను నానికి మంచి క్రేజ్ వుంది .. ఆయన సినిమాలకి మంచి మార్కెట్ వుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 'రంగస్థలం' వసూళ్లపై ఏ మేరకు ప్రభావం చూపనుందనేది ఆసక్తికరంగా మారింది. నాని సక్సెస్ ల జాబితాలో ఈ సినిమా చేరిపోతుందా .. లేదా? అనేది ఉత్కంఠను రేపుతోంది.  

More Telugu News