Pawan Kalyan: దివ్యాంగుల టీ20 క్రికెట్‌కు పవన్ కల్యాణ్ రూ.5 లక్షల సాయం

  • 14 నుంచి దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్
  • పోటీలకు వేదికగా హైదరాబాద్‌ 
  • పవన్‌ను కలిసిన నిర్వాహకులు
  • క్రీడాకారులకి పవన్ అభినందనలు

వైకల్యం అనేది ప్రతిభకు ఏ మాత్రం అడ్డంకి కాదని దివ్యాంగులైన క్రికెటర్లు నిరూపిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సభ్యులు, దివ్యాంగులైన క్రికెట్ క్రీడాకారులు పవన్ కల్యాణ్‌ని కలిశారు. ఈ నెల 14వ తేదీ నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే దివ్యాంగుల రెండో జాతీయ క్రికెట్ టోర్నమెంట్ - టీ20 పోటీల వివరాలను తెలిపారు. 24 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటున్నాయని, 18వ తేదీన పోటీలు ముగుస్తాయని చెప్పారు.  ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులు, క్రీడాకారులని పవన్ కల్యాణ్ అభినందించి, ఈ పోటీలకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. దివ్యాంగ క్రికెట్ జాతీయ జట్టు కెప్టెన్ వసంత కుమార్, ఏపీ జట్టు సభ్యులు శ్రీనివాసులు, తేజలతో ముచ్చటించారు. ఆత్మస్థైర్యంతో క్రీడల్లో పాల్గొనడం దివ్యాంగులందరికీ స్ఫూర్తినిస్తుందని పవన్ అన్నారు. పవన్‌ను కలిసిన వారిలో బీడీసీఏ ఛైర్మన్ పీ హరిప్రసాద్, కార్యదర్శి  కే రామ్ రెడ్డి ఉన్నారు.

More Telugu News