Donald Trump: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడిన తీరు భేష్... అయినా పన్నులు ఎత్తేసేది లేదు: అమెరికా

  • చైనా నుంచి నిర్మాణాత్మక చర్యలు ఆశిస్తున్నాం
  • అంత వరకు చర్చలు కొనసాగుతాయి
  • వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ శాండర్స్ ప్రకటన

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజా ప్రకటన పట్ల అమెరికా సంతోషం వ్యక్తం చేసింది. జిన్ పింగ్ మాట్లాడిన తీరు ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ అన్నారు. కానీ, అదే సమయంలో 150 బిలియన్ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించేది లేదని స్పష్టం చేశారు.

చైనా నుంచి నిర్మాణాత్మక చర్యలను ఆశిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. అది జరిగేంత వరకు చైనాతో చర్చలను కొనసాగించే ప్రక్రియను ముందుకు తీసుకు వెళతామన్నారు. ‘‘టారిఫ్ లు, ఆటోమొబైల్ అడ్డంకులపై చైనా అధ్యక్షుడు మాట్లాడిన పదాలకు ఎంతో ధన్యవాదాలు. మేధో హక్కులు, టెక్నాలజీ బదిలీలపై ఆయనకు జ్ఞానోదయం కావడం సంతోషం. మేం ఇరువురం కలసి మరింత ప్రగతి సాధిస్తాం’’అని ట్రంప్ ట్వీట్ చేశారు.

More Telugu News