kalyani priyadarshan: ఈ రూమర్ నిజమైతే చాలా బాగుంటుంది: కల్యాణి ప్రియదర్శన్

  • 'హలో'తో ఆకట్టుకున్న కల్యాణి 
  • తదుపరి చిత్రం శర్వానంద్ తో 
  • తాజా రూమర్ పై స్పందన  

'హలో' సినిమాతో తెలుగు తెరకి కల్యాణి ప్రియదర్శన్ పరిచయమైంది. ఈ సినిమా ఓ మాదిరిగా ఆడినా, క్యూట్ లుక్స్ తో యూత్ హృదయాలను కల్యాణి ప్రియదర్శన్ దోచేసింది. ప్రస్తుతం ఈ అమ్మాయి సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ జోడీగా ఒక సినిమా చేస్తోంది. ఇక మలయాళంలోను ఈ అమ్మాయి ఒక సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది.

మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా, ఐ.వి. శశి తనయుడు 'అని శశి' ఈ సినిమాకి దర్శకత్వం చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం కల్యాణి ప్రియదర్శన్ వరకూ చేరడంతో ఆమె స్పందించింది. ఇదంతా కేవలం పుకారు మాత్రమేననీ .. అందులో ఎంతమాత్రం నిజంలేదని చెప్పింది. ఈ పుకారు నిజమైతే చాలా బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.      

More Telugu News