Prime Minister: డేటాను భారత్ లోనే స్టోర్ చేసే విధంగా కట్టడి చేయాలనే యోచనలో ప్రధాని

  • డేటా లీక్ పై ఆందోళన వ్యక్తీకరణ
  • సహచర మంత్రులతో ఈ అంశంపై చర్చ

ఇటీవలి ఫేస్ బుక్ యూజర్ల డేటా లీకేజీ వ్యవహారం వెలుగు చూసిన తదనంతర పరిణామాల నేపథ్యంలో డేటా షేరింగ్ ను కట్టడి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్నారు. దీనిపై ఇటీవలే కేంద్ర కేబినెట్ సమావేశం సందర్భంగా సహచర మంత్రులతో ఆయన చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. డేటా లీకేజీలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారత యూజర్ల సమాచారాన్ని స్టోర్ చేసే సర్వర్లు మన దేశంలోనే ఉండే విధంగా చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫేస్ బుక్, వాట్సాప్, గూగుల్, ఇన్ స్టా గ్రామ్ తదితర సంస్థలు చాలా వరకు యూజర్ల డేటాను అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఏర్పాటు చేసిన సర్వర్లలో స్టోర్ చేస్తున్నాయి. వీటిలోని సమాచారం పొందేందుకు చట్టాలు అడ్డుపడుతున్నాయి. దీంతో యూజర్ల సమాచారం భారత్ లోనే స్టోర్ చేయడంతోపాటు, ఈ సమాచారాన్ని ఇతర సంస్ధలతో షేర్ చేసుకోవడాన్ని నియంత్రించడం ప్రాధామ్యాలుగా మోదీ సహచర మంత్రులతో అన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News