Axis Bank: ఒక్క వార్తతో ఒక్క రోజులోనే రూ.7200 కోట్లకు పెరిగిన యాక్సిస్ బ్యాంకు షేర్ల విలువ

  • ఆర్బీఐ ప్రశ్నలతో యాక్సిస్ బ్యాంకు ఉక్కిరి బిక్కిరి
  • ఎండీ శిఖాశర్మ పదవీ కాలాన్ని 29 నెలలు తగ్గించిన బ్యాంకు
  • ఆమె హయంలో భారీగా పెరిగిపోయిన నిరర్థక ఆస్తులు

ఒకే ఒక్క వార్తతో యాక్సిస్ బ్యాంకు ఒక్క రోజులోనే రూ.7200 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించింది. బ్యాంకు సీఈవో, ఎండీ శిఖా శర్మ పదవీ కాలాన్ని ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి తగ్గించిన మరుసటి రోజే ఇలా జరగడం గమనార్హం. శిఖా శర్మ పదవీ కాలం తగ్గింపు వార్తతో షేర్లు ఒక్కసారిగా 5.4 శాతం పెరిగాయి. ఫలితంగా వాటి మొత్తం విలువ రూ.1.41 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

 కాగా, గత మూడేళ్లలో శిఖా శర్మ కాలంలో బ్యాంకు నిరర్థక ఆస్తుల విలువ ఏకంగా 300 శాతం పెరగడం గమనార్హం. శిఖాశర్మను నాలుగోసారి తిరిగి ఎండీ, సీఈవోగా నియమించడంపై యాక్సిస్ బ్యాంకును భారతీయ రిజర్వు బ్యాంకు ప్రశ్నించింది. బ్యాంకు నిరర్ధక ఆస్తులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతుండడంపై ప్రశ్నలు సంధించింది. దీంతో శిఖా శర్మ పదవీ కాలాన్ని 29 నెలలు తగ్గించి ఈ ఏడాది డిసెంబరు నాటికి కుదించింది.

More Telugu News