stock markets: వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

  • ఈరోజు ట్రేడింగ్ లో లాభపడ్డ సెన్సెక్స్, నిఫ్టీ
  • హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్ తదితర సంస్థల షేర్లకు లాభాలు
  • ఐడియా సెల్యులర్, బజాజ్ ఫిన్ తదితర సంస్థలకు నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ 91.71 పాయింట్లు లాభపడి 33,880 వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభపడి 10,402 పాయింట్ల వద్ద ముగిశాయి. హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ తదితర షేర్లు లాభపడగా, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఐడియా సెల్యులర్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్ సర్వీసు మొదలైన సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

కాగా, ఉదయం స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం సమయానికి ఆరంభ లాభాలు తగ్గిపోయాయి. అయితే, నిన్న దేశీయంగా సంస్థాగత మదుపరులు రూ.359.35 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం, అమెరికాతో వాణిజ్య యుద్ధం విషయమై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించడం, పలు వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించడం కూడా మదుపరుల సెంటిమెంట్ ను బలపరచడంతో ఈరోజు దేశీయ మార్కెట్లు చివరకు లాభాలతో ముగిశాయి.

More Telugu News