ram: యూరప్ నేపథ్యంలో కథ .. రంగంలోకి రామ్

  • ప్రవీణ్ సత్తారుతో రామ్ 
  • కథానాయికగా మాళవిక శర్మ 
  • మే నెలలో షూటింగ్ మొదలు

కొంతకాలంగా రామ్ కి సరైన హిట్ పడటం లేదు. దాంతో ఆయన విభిన్నమైన కంటెంట్ తో ఈసారి హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఒక సినిమాను చేయడానికి రామ్ సిద్ధమవుతున్నాడు. చాలావరకూ మంచు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ కొనసాగనుందట. అందువలన ఎక్కువ భాగం చిత్రీకరణ యూరప్ లో చేయనున్నట్టు చెబుతున్నారు.

ఈ సినిమాలో రామ్ ను కొత్తగా చూపించడమే కాకుండా .. ఆయన చేసే యాక్షన్ ఎపిసోడ్స్ ను డిఫరెంట్ గా ప్రవీణ్ సత్తారు ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలోని మూడు కీలకమైన పాత్రల కోసం తమిళ .. మలయాళ .. హిందీ భాషల నుంచి ముగ్గురు నటులను ఎంపిక చేసుకుంటారట. మాళవిక శర్మ కథానాయికగా నటించే ఈ సినిమాను, మే మొదటివారంలో ఆరంభించనున్నారు.   

More Telugu News