krish: 'అహం బ్రహ్మాస్మి' కథ సిద్ధం .. హీరోగా తెరపైకి బన్నీ పేరు

  • కొత్త కథను సిద్ధం చేసిన క్రిష్ 
  • టైటిల్ గా 'అహం బ్రహ్మాస్మి'
  • బన్నీని సంప్రదించనున్న క్రిష్   

'నా పేరు సూర్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి బన్నీ సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన 'క్షణం' దర్శకుడు రవికాంత్ పేరెపుతో కలిసి ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. తాజాగా దర్శకుడు క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. 'మణికర్ణిక' హిందీ మూవీ పనులు పూర్తిచేసిన తరువాత క్రిష్ ఒక తెలుగు సినిమా చేయనున్నాడు.

 ఈ సినిమా కోసం కథను సిద్ధం చేసిన క్రిష్ .. 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాడు. కథా పరంగా .. పాత్ర పరంగా ఇది బన్నీకి సెట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడట. త్వరలోనే బన్నీని కలిసి కథ చెప్పనున్నాడని అంటున్నారు. గతంలో క్రిష్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేశాడు. ఆయన టేకింగ్ పై బన్నీకి మంచి నమ్మకం వుంది. అందువలన ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు వున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది.        

More Telugu News