Facebook: ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ కు 'అలీబాబా' చీఫ్ జాక్ మా విసిరిన చాలెంజ్ ఇది!

  • ఫేస్ బుక్ పై ఇప్పటికే ప్రపంచమంతా ఆగ్రహం
  • చేతనైతే సమస్యను పరిష్కరించి చూపించు
  • జుకర్ బర్గ్ కు సవాల్ విసిరిన జాక్ మా

ఫేస్ బుక్ లో జరిగిన డేటా చౌర్యంపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతున్న వేళ, చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా, ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బర్గ్ కు ఓ సవాల్ విసిరారు. ఈ వివాదంపై స్పందించిన ఆయన, మార్క్ కు చేతనైతే ఫేస్ బుక్ లో ఉన్న సమస్యను పరిష్కరించాలని చాలెంజ్ చేశారు. బావో ఫోరమ్ లో పాల్గొన్న ఆయన, ఫేస్ బుక్ సంస్థ కష్టాలను తొలగించే దిశగా తాను ఎటువంటి సహాయమూ చేయబోనని తేల్చి చెప్పారు.

సామాజిక మాధ్యమంగా చెప్పుకుంటున్న ఫేస్ బుక్, తన డేటా చౌర్యం కాకుండా చూసుకునే వీలు లేదని అభిప్రాయపడ్డ ఆయన, సోషల్ మీడియాలోని వివరాలు బయటకు పొక్కకుండా సమస్యను సాల్వ్ చేసి చూపించగలరా? అని మార్క్ ను ప్రశ్నించారు. కాగా, ఫేస్ బుక్ ను వాడుతున్న కోట్లాది మంది యూజర్ల సమస్త సమాచారం చోరీకి గురికాగా, ఆ సంస్థ ఈక్విటీ వాటాల విలువ భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News