chris gyle: గేల్ ను వదులుకోవడానికి కారణం ఇదే: కోహ్లీ

  • జట్టు కోసమే గేల్ ను వదులుకున్నాం
  • గేల్ కు వయసుతో సంబంధం లేదు
  • భవిష్యత్ అవసరాల దృష్ట్యా గేల్ ను వదులుకున్నాం

వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ను ఐపీఎల్‌ సీజన్-11 లో జట్టులోకి తీసుకోకపోవడంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. కోల్ కతాలో కోహ్లీ మాట్లాడుతూ, భవిష్యత్ మూడేళ్లను దృష్టిలో పెట్టుకుని గేల్ ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదని అన్నాడు. భవిష్యత్ అవసరాల ప్రకారం గేల్ కు బదులుగా మరో ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని భావించామని చెప్పాడు.

గత కొన్నేళ్లుగా గేల్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆడుతున్నాడని కోహ్లీ గుర్తు చేశాడు. గేల్ కు వయసుతో సంబంధం లేదని, ఎప్పుడైనా పుంజుకోగలడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. అయితే జట్టు భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని గేల్ ను వదులుకున్నామని కోహ్లీ తెలిపాడు. గేల్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News