Uttar Pradesh: యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం.. సాక్షులు లేరని కేంద్ర మాజీ మంత్రిపై రేప్ కేసు ఎత్తివేత

  • 2011లో కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందపై రేప్ కేసు
  • హరిద్వార్ లోని ఆశ్రమంలో రేప్ చేశారన్న బాధితురాలు
  •  సీఆర్పీసీ సెక్షన్ 321 ప్రకారం కేసు విత్ డ్రా

కేంద్ర మాజీ మంత్రిపై నమోదైన రేప్ కేసును ఎత్తివేస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పదంగా మారిన ఆ నిర్ణయం వివరాల్లోకి వెళ్తే.. 1991, 1998, 1999 సంవత్సరాల్లో షాజహాన్ పూర్ కు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించి, ఎంపీగా పని చేసిన చిన్మయానంద, అటల్ బిహారీ వాజ్ పేయి సర్కారులో కేంద్ర అంతర్గత భద్రత సహాయమంత్రిగా పనిచేశారు. హరిద్వార్ లోని ఒక ఆశ్రమంలో ఉన్న తనపై ఆయన 2011 నవంబర్ లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఒక బాలిక షాజహాన్ పూర్ లోని కొత్వాలీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

 అంతే కాకుండా రేప్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తానని కూడా బెదిరించాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన చిన్మయానంద అరెస్టు కాకుండా స్టే తెచ్చుకున్నారు. దీంతో ఈ రేప్ కేసు పెండింగ్ లో పడిపోయింది. తాజాగా ఈ కేసును సీఆర్పీసీ సెక్షన్ 321 ప్రకారం విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రాసిక్యూషన్ కు ప్రభుత్వాధికారులు లేఖ రాశారు. దీంతో ఈ అత్యాచారం కేసులో సాక్షులు లేనందువల్ల.. ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఈ కేసు ఎత్తివేత నిర్ణయం వివాదాస్పదమవుతోంది.

More Telugu News