India: భారత సరిహద్దులో చైనా పెట్రోలింగ్‌ బోట్‌లు.. శాటిలైట్‌ ఎర్లీ వార్నింగ్‌ మానిటరీ సిస్టమ్‌

  • పాంగాంగ్‌ సరస్సు వద్ద సరికొత్త పెట్రోలింగ్‌ బోట్‌లు
  • గంటకు 40 కిలో మీటర్ల వేగంతో గస్తీ కాసే సామర్థ్యం
  • ఓ నిఘా కెమెరా నెట్‌వర్క్‌ కూడా ఏర్పాటు

భారత సరిహద్దులో చైనా నిఘా పెంచేస్తోంది. ఇందుకోసం చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ భారత్‌లోని లద్దాఖ్‌, టిబెట్‌ అటోనామస్‌ రీజియన్‌ (ఏటీఆర్‌) మధ్య పాంగాంగ్‌ సరస్సు వద్ద సరికొత్త పెట్రోలింగ్‌ బోట్‌లను తీసుకొచ్చింది. ఈ బోట్లు నాన్‌ మెటాలిక్‌ పదార్థాలతో తయారు చేయబడినవి. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో అవి గస్తీ కాస్తూ.. మంచు దిబ్బలను కూడా తట్టుకోవగలవు. పెట్రోలింగ్‌ బోట్‌లతో పాటు ఓ నిఘా కెమెరా నెట్‌వర్క్‌ను తయారుచేసి సరిహద్దు బలగాలు వెళ్లలేని ప్రాంతాల్లో దాన్ని వినియోగిస్తోంది. దానితో పాటు శాటిలైట్‌ ఎర్లీ వార్నింగ్‌ మానిటరీ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈ విషయాలను చైనా మీడియా ఓ కథనంలో పేర్కొంది.

More Telugu News