ipl: ఐపీఎల్ లో డ్యాన్స్ చేయడానికి తమన్నా ఎంత తీసుకుంటోందో తెలుసా?

  • కాసేపట్లో ప్రారంభం కానున్న ఐపీఎల్
  • డ్యాన్స్ చేయనున్న హృతిక్, తమన్నా, జాక్వెలిన్
  • 10 నిమిషాలకు 50 లక్షలు తీసుకుంటున్న మిల్కీ బ్యూటీ

కాసేపట్లో ఐసీఎల్-11 ప్రారంభం కోబోతోంది. ఐపీఎల్ ప్రారంభోత్సవం సందర్భంగా వేదికపై హృతిక్ రోషన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నాలు డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నారు. పది నిమిషాల పాటు డ్యాన్స్ చేయనున్న తమన్నా ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటోందో తెలిస్తే షాక్ అవడం ఖాయం. ఈ పది నిమిషాలకు ఆమె రూ. 50 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. ప్రభుదేవాతో కలసి ఆమె డ్యాన్స్ చేయబోతోంది. ఈ ప్రదర్శన కోసం ఆమె షయామక్ ధావర్ నేతృత్వంలో శిక్షణ తీసుకుంది. నాలుగు పాటల మిక్సింగ్ కు ఆమె డ్యాన్స్ చేయనున్నట్టు సమాచారం. 

More Telugu News