YSRCP: వైసీపీ ఎంపీలతో కలసి దీక్షా శిబిరంలో కూర్చున్న సీతారాం ఏచూరి

  • వైసీపీ ఎంపీల దీక్షకు సీపీఎం సంఘీభావం
  • రాష్ట్ర విభజనతో సమస్యలు వస్తాయని ఎప్పుడో చెప్పామన్న ఏచూరి
  • ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదంటూ విమర్శ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆమరణదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షకు ఢిల్లీలోని తెలుగు సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. మరోవైపు వైసీపీ ఎంపీల దీక్షకు సీపీఎం కూడా మద్దతు పలికింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షా శిబిరానికి వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఎంపీలతో పాటు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు వస్తాయనే విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని తెలిపారు. విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని... కానీ, ఆ హామీని బీజేపీ నెరవేర్చలేకపోయిందని చెప్పారు. 

More Telugu News