samanta: 'మహానటి' నుంచి సమంత ఫస్టులుక్

  • సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి'
  • టైటిల్ రోల్ లో కీర్తి సురేశ్ 
  • 'మధురవాణి' పాత్రలో సమంత  

ప్రముఖ నటి సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ పోషించగా, జర్నలిస్ట్ 'మధురవాణి' పాత్రలో సమంత కనిపించనుంది. సమంతకి సంబంధించిన ఫస్టులుక్ ను కొంతసేపటి క్రితం వదిలారు. చాలాకాలం క్రితం నాటి సమాచారం కోసం వెదుకుతోన్న ఓ జర్నలిస్ట్ గా ఈ పోస్టర్ లో సమంత కనిపిస్తోంది.

సమంత కాస్ట్యూమ్స్ .. ముక్కు పుడక ఆమెకు కొత్త లుక్ ను తీసుకొచ్చాయి. ' నా పేరు .. కన్యాశుల్కంలో సావిత్రిగారి పేరే .. మధురవాణి' అంటూ పోస్టర్ ద్వారా ఈ పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయనున్న విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారా స్పష్టం చేశారు. 'రంగస్థలం'లో రామలక్ష్మి గా సందడి చేసిన సమంత, 'మహానటి' లో మధురవాణిగా ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.     

More Telugu News