Cricket: మహిళా క్రికెట్ చరిత్రలో అత్యధిక వన్డేలు ఆడిన మహిళగా మిథాలీ రాజ్ రికార్డు

  • అంతర్జాతీయ క్రికెట్ లో 192 వన్డేలు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్
  • ఇంగ్లండ్ తో నాగ్ పూర్ లో జరుగుతున్న వన్డేతో రికార్డు కైవసం
  • గతంలో ఈ రికార్డు సాధించిన ఇంగ్లండ్ క్రీడాకారిణి చార్లెట్ ఎడ్వర్డ్స్ 

మహిళా క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డును భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ నెలకొల్పింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ (191) పేరిట ఉన్న రికార్డును నాగ్ పూర్ వేదికగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ప్రారంభమైన తొలి వన్డేతో మిథాలీ రాజ్ (192) అధిగమించింది.

1999 జూన్‌ లో అంతర్జాతీయ క్రికెట్‌ లో అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్ చిరస్మరణీయ ప్రదర్శనలతో వన్డేల్లో 6,295 పరుగులు చేసింది. 10 మ్యాచ్ లలో బౌలింగ్‌ చేసి 8 వికెట్లు కూడా తీసింది. ఇప్పటికే ఆమె ఖాతాలో అంతర్జాతీయ వన్డే మహిళా క్రికెట్ లో 6 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి క్రికెటర్ రికార్డు భద్రంగా ఉంది. రెండుసార్లు భారత మహిళా క్రికెట్ జట్టును ప్రపంచకప్‌ ఫైనల్స్ కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌ కూడా ఆమే కావడం విశేషం. 

More Telugu News