sai dharam tej: మెగాహీరో మూవీ టైటిల్ .. 'తేజ్ ఐ లవ్ యూ'?

  • కరుణాకరన్ తో సాయిధరమ్ తేజ్ 
  • యూత్ కి కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ 
  • త్వరలోనే టైటిల్ ప్రకటన

సాయిధరమ్ తేజ్ ను వరుసగా అయిదు పరాజయాలు పలకరించినా, ఆయన చేతిలో నాలుగు సినిమాలుండటం విశేషం. ఈ నాలుగు సినిమాల్లో కరుణాకరన్ తో చేసే సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ముందుగా ఈ సినిమాకి 'దేవుడు వరమందిస్తే' అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత 'అందమైన చందమామ'అనే టైటిల్ తెరపైకి వచ్చింది.

 ఇందులో నిజం లేదని సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. ఆ మరుసటి రోజు నుంచే మరో టైటిల్ వినిపిస్తోంది. ఈ సినిమాకి 'తేజ్ ఐ లవ్ యూ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారనీ .. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ తో కరుణాకరన్ రూపొందిస్తోన్న ఈ సినిమా, సాయిధరమ్ తేజ్ కి విజయాన్ని కట్టబెడుతుందో లేదో చూడాలి.    
 

More Telugu News