డిన్నర్ కు పిలిచి.. జూనియర్ డాక్టర్ పై సీనియర్ డాక్టర్ అత్యాచారం!

06-04-2018 Fri 12:43
  • ఇంటర్న్ షిప్ కు వచ్చిన జూనియర్ డాక్టర్ పై కన్నేసిన  సీనియర్ డాక్టర్ 
  • డిన్నర్ కు ఆహ్వానించిన గుర్ దీప్ సింగ్
  • డ్యూటీ రూం తలుపులు వేసి అత్యాచారం

జూనియర్ డాక్టర్ పై సీనియర్ డాక్టర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీలోని హిందూరావు ఆసుపత్రిలో నాలుగేళ్లుగా పని చేస్తున్న సీనియర్ డాక్టర్ గుర్ దీప్ సింగ్..అక్కడికి మెడికల్ ఇంటర్న్‌ షిప్‌ చేసేందుకు వచ్చిన జూనియర్ డాక్టర్ పై కన్నేశాడు.

విధుల్లో ఉండగా, డిన్నర్ చేద్దామని ఆమెను ఆహ్వానించారు. అనంతరం డ్యూటీ రూం తలుపు వేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసిన పోలీసులు, ఆమెకు వైద్యపరీక్షలు చేయించి, ఆరోపణలు వాస్తవమని నిర్ధారించుకుని కేసునమోదు చేసి గుర్ దీప్ సింగ్ ను అరెస్టు చేశారు.