సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

Fri, Apr 06, 2018, 07:29 AM
  • కృష్ణవంశీ సినిమాలో నయనతార
  • ఆ టైటిల్ కాదంటున్న మెగా హీరో 
  • నాగశౌర్య చిత్రానికి మంచి క్రేజ్ 
  • 'హలో గురూ ప్రేమ కోసమే' అంటున్న రామ్  
 *  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా కథానాయిక ప్రధాన చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కేఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'అందమైన చందమామ' అనే టైటిల్ని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, ఇంకా టైటిల్ అనుకోలేదని సాయి ధరం తేజ్ ప్రకటించాడు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటిస్తోంది.    
*  'ఛలో' చిత్రం విజయంతో మంచి జోరు మీదున్న యంగ్ హీరో నాగ శౌర్య చేసిన  తాజా చిత్రం 'అమ్మమ్మగారిల్లు'. సుందర్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. కాగా, ఈ చిత్రానికి మంచి హైప్ రావడంతో శాటిలైట్ హక్కులను 2.75 కోట్లకు జెమినీ టీవీ సొంతం చేసుకుంది.      
*  రామ్ హీరోగా త్రినాధ్ రావ్ నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం రామ్, ప్రకాష్ రాజ్ లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement