Pawan Kalyan: ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్

  • ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’
  • విజయవాడలో పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • హాజరైన పలువురు నేతలు

మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఆవిష్కరించారు. ఈ  సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంకా ఐవైఆర్ కృష్ణారావు, సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ, సీనియర్ రాజకీయవేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాలను ఆవిష్కరించిన పవన్ కల్యాణ్ ఆయా కాపీలను వారికి అందజేశారు. అంతకుముందు, ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ పుస్తకాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావుకు అంకితమివ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ పుస్తకం చదవగానే రాజధాని అంటే ఏమిటి? ఏ దేశంలో ఏ రాజధాని ఎలా నిర్మించారు? ఆయా రాజధానుల బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే విషయాలు తెలుస్తాయని అన్నారు. అవినీతి మచ్చలేని, నిజాయతీ గల ఐవైఆర్ కృష్ణారావుకు అన్ని విషయాలు తెలుసని, ఆయన నిజం చెబుతుంటే, ‘ద్రోహులు, దుర్మార్గులు, ప్రభుత్వానికి వెన్నుపోటు పొడుస్తున్నారు’ అంటూ ఆయనపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.  

More Telugu News