nani: నాని ఫ్యాన్స్ ను ఊరిస్తోన్న 'కృష్ణార్జున యుద్ధం' .. అదే రోజున వచ్చేస్తోంది

  • మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' 
  • ద్విపాత్రాభినయం చేసిన నాని 
  • ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు  

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా 'కృష్ణార్జున యుద్ధం' రూపొందింది. నాని ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ .. రుక్సార్ మీర్ కథానాయికలుగా అలరించనున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. మేర్లపాక గాంధీ గతంలో చేసిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' .. 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాలు ఘన విజయాలను సాధించడం వలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. నాని డిఫరెంట్ లుక్స్ .. 'హిపాప్ తమిళ' సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. 

More Telugu News