West Godavari District: కొడుకు చేసిన తప్పుకి తండ్రికి శిక్ష.. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్యాయత్నం

  • యువతిని వేధించిన నాగేంద్ర
  •  పంచాయతీ పెట్టించగా పట్టించుకోని నాగేంద్ర
  • నాగేంద్ర తండ్రిని పిలిచి అవమానించిన పంచాయతీ

కొడుకు చేసిన తప్పుకు తండ్రిని శిక్షించడంతో పరువు పోయిందని భావించిన సదరు తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... పశ్చిమగోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం సాయంపాలెం గ్రామంలో నాగేంద్ర అనే యువకుడు ఒక యువతిని వేధించాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టించారు.

 పంచాయతీ నిర్ణయాన్ని లెక్కచేయని నాగేంద్ర సమావేశానికి వెళ్లలేదు. దీంతో నాగేంద్ర తండ్రి సంజీవను పంచాయతీ పెద్దలు పిలిపించారు. అక్కడికి వెళ్లిన సంజీవను చెట్టుకు కట్టి దుర్భాషలాడి అవమానించారు. కొడుకును అదుపులో పెట్టుకోనందుకు కొందరు చెయ్యి కూడా చేసుకున్నారు. అవమాన భారంతో ఇల్లు చేరిన సంజీవ, పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో కిందపడి ఉన్న సంజీవను ఇరుగుపొరుగులు గుర్తించి జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఏలూరు ఆసుపత్రికి తరలించారు.

More Telugu News