charan: సెట్లో అంతా నన్ను 'రంగమ్మత్త' అనే పిలిచేవారు!: అనసూయ

  • నేను నా క్రేజ్ ను పక్కన పెట్టేశాను 
  • మేకప్ వేసుకున్నాక నన్ను నేను మరచిపోయాను  
  • అందుకే ఆ పాత్ర అంతలా పండింది

'రంగస్థలం' సినిమా చరణ్ .. సమంత .. జగపతిబాబు తరువాత అనసూయకి ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె పోషించిన 'రంగమ్మత్త' పాత్ర జనంలోకి దూసుకుపోయింది. ఈ పాత్రకి దక్కుతోన్న గుర్తింపుకు అనసూయ సంతోషంతో పొంగిపోతోంది.

తాజాగా ఈ పాత్ర గురించి ఆమె స్పందిస్తూ .. " 'రంగమ్మత్త'గా వేషధారణ .. మేకప్ వేసుకున్నాక నేను అనసూయను అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయాను. బుల్లితెరపై నాకు గల క్రేజ్ ను కూడా పూర్తిగా పక్కన పెట్టేశాను. సెట్లో అంతా కూడా నన్ను 'రంగమ్మత్త' అనే పిలవడం .. నేను ఆ పాత్రలోనే ఉండిపోవడానికి ఉపయోగపడింది. నేనలా 'రంగమ్మత్త'గా మారిపోవడం వల్లనే ఆ పాత్ర అంత బాగా పండింది .. నాకు మంచి పేరు వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే 'రంగమ్మత్త' పాత్ర నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.        

More Telugu News