facebook: ఫేస్ బుక్ లో ఇకపై ఫ్రెండ్స్ జాడ తెలుసుకోవడం చాలా కష్టం...!

  • ఇందుకు సంబంధించి టూల్ తొలగింపు
  • డేటా చోరీకి గురైన ఖాతాలు 8.7 కోట్లు
  • ఇకపై యూజర్ల సమాచారానికి కట్టుదిట్టమైన రక్షణ

కేంబ్రిడ్జ్ అనలైటికా అనే సంస్థ ఓ యాప్ సాయంతో ఫేస్ బుక్ యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని చోరీ చేసిందన్న విషయం తెలిసిందే. సుమారు 5 కోట్ల మంది యూజర్ల సమాచారం ఇలా చోరీకి గురైనట్టు తొలుత భావించగా, ఆ సంఖ్య 8.7 కోట్లు అని తాజా సమాచారం వెలుగు చూసింది. థర్డ్ పార్టీ డెవలపర్లు ‘అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ ఫేస్’ ద్వారా ఫేస్ బుక్ తో అనుసంధానమై యూజర్ల డేటాను సేకరించినట్టు ఫేస్ బుక్ చీఫ్ టెక్నాలజీ అధికారి మైక్ స్క్రోప్ ఫర్ తెలిపారు. అయితే తాజా ఘటన నేపథ్యంలో ఫేస్ బుక్ యూజర్ల సమాచారాన్ని రక్షణ కల్పించే చర్యలు చేపట్టింది.

యూజర్ల సమాచారం తెలుసుకునేందుకు ఇకపై ఫేస్ బుక్ ఎవరినీ అనుమతించదు. లొకేషన్, ఫొటోలు, పోస్టులకు సంబంధించి సమాచారం కావాలని వచ్చే దరఖాస్తుల సమీక్షను కఠినతరం చేసింది. ఫేస్ బుక్ యూజర్లు ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ ఆధారంగా తమకు తెలిసిన వారి ఫేస్ బుక్ పేజీలను వెతికి పట్టుకోవడం ఎంతో సులభం. అయితే, ఇకపై దీనికీ అవకాశం ఉండదు. సంబంధిత టూల్ ను తొలగించనున్నట్టు  మైక్ స్క్రోప్ ఫర్ చెప్పారు.

More Telugu News