dr br ambedkar: అంబేడ్కర్ కు సముచిత గౌరవం ఇస్తున్నాం... ఆయన మార్గంలోనే నడుస్తున్నాం: మోదీ

  • అంబేడ్కర్ చూపిన శాంతి, సమానత్వం మార్గంలోనే నడుస్తున్నాం
  • ఆయన జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేశాం
  • విపక్షాలు ఆయన పేరుని వివాదాల్లోకి లాగుతున్నాయి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ను తమ ప్రభుత్వం ఎంతగానో గౌరవించిందని, తాము గౌరవించినంతగా మరే ప్రభుత్వమూ ఆయనను గౌరవించలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశవ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్న సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ హౌస్‌ లో ఎంపీల వసతి కోసం నిర్మిస్తున్న వెస్ట్రన్‌ కోర్ట్‌ ఎన్నెక్స్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అంబేడ్కర్ చూపిన శాంతి, సమానత్వం మార్గంలోనే తాము నడుస్తున్నామని అన్నారు. ఆయన జ్ఞాపకార్థంగా ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పారు. ఆయన పేరుపై విపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తూ వివాదాల్లోకి లాగుతున్నాయని, తాము మాత్రం ఆయనకు సముచిత స్థానం కల్పించామని ఆయన అన్నారు.

More Telugu News