Commonwealth Games: బోణీ కొట్టారు... కామన్వెల్త్ గేమ్స్ లో తొలి పతకం సాధించిన ఇండియా

  • ఆస్ట్రేలియాలో ప్రారంభమైన కామన్వెల్త్ పోటీలు
  • 56 కిలోల విభాగంలో పతకంతో భారత్ బోణీ
  • రజతం సాధించిన గురురాజ్

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్ క్వీన్స్‌ లాండ్‌ లోని కర్రారా మైదానంలో అట్టహాసంగా మొదలైన కామన్వెల్త్ పోటీల్లో ఇండియా తొలి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజ్ రజత పతకాన్ని సాధించి బోణీ కొట్టాడు. మూడు రౌండ్లలో మొత్తం 249 కిలోల బరువును ఎత్తిన గురురాజ్ రెండో స్థానంలో నిలిచాడు.

261 కిలోల బరువును ఎత్తిన మలేసియా వెయిట్‌ లిప్టర్‌ మహ్మద్‌ ఇజార్‌ అహ్మద్‌ స్వర్ణ పతకం సాధించాడు. మరోవైపు బ్యాడ్మింటన్ మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో 3-0 తేడాతో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. భారత మహిళల హాకీ జట్టు పేలవమైన ప్రదర్శన కనబరిచింది. వేల్స్ తో జరిగిన మ్యాచ్ లో 2-3 తేడాతో పరాజయం పాలైంది.

కాగా, ఈనెల 15 వరకు జరిగే ఈ పోటీల్లో 71 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొననుండగా, మొత్తం 19 క్రీడాంశాలలో 275 విభాగాల్లో పోటీలు సాగనున్నాయి. 17 క్రీడాంశాల్లో ఇండియా తరఫున 225 మంది పతకాల కోసం వేట సాగించనున్నారు.

More Telugu News