Deepika Padukone: 'ఎన్టీఆర్' మూవీలో బసవతారకంగా దీపికా పదుకొనే?

  • బాలకృష్ణ సొంత బ్యానర్లో 'ఎన్టీఆర్' 
  • మొదలైన నటీనటుల పరిశీలన
  • తెరపైకి దీపికా పదుకొనే పేరు

ఎన్టీ రామారావు జీవితచరిత్ర ఆధారంగా .. 'ఎన్టీఆర్' సినిమా రూపొందుతోంది. అతిరథ మహారథుల సమక్షంలో ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్న బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించనున్నారు. మిగతా పాత్రలకి సంబంధించిన నటీనటుల కోసం పరిశీలన జరుగుతోంది.

 ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణి 'బసవతారకం' పాత్రలో విద్యాబాలన్ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. విద్యాబాలన్ లో కనిపించే నిండుదనం కారణంగా ఈ పాత్రకి ఆమెను ఎంపిక చేయనున్నారనే టాక్ వినిపించింది.కానీ తాజాగా దీపికా పదుకొనే పేరు తెరపైకి వచ్చింది. నటన పరంగా దీపికకు వంకబెట్టవలసిన పనిలేదు. 'శ్రీదేవి' బయోపిక్ దీపిక చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బసవతారకం పాత్ర కోసం దీపికనే దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.     

More Telugu News