terrorists: ఐక్యరాజ్యసమితి టెర్రరిస్టుల జాబితాలో దావూద్ ఇబ్రహీం.. అడ్రస్ ను కూడా పేర్కొన్న యూఎన్

  • జాబితాలోని 139 పేర్లు పాకిస్థాన్ నుంచే
  • దావూద్ కు పలు పాకిస్థానీ పాస్ పోర్టులు ఉన్నాయన్న యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్
  • తాజా జాబితాతో మరోసారి దోషిగా నిలబడ్డ పాక్

టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు, ఉగ్రవాదుల జాబితాను ఐక్యరాజ్య సమితికి చెందిన భద్రతామండలి విడుదల చేసింది. ఈ జాబితాలో 139 పేర్లు పాకిస్థాన్ కు చెందినవే ఉండటం గమనార్హం. ముంబై దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్, అల్ జవహరి, దావూద్ ఇబ్రహీం తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రావల్పిండి, కరాచీల నుంచి పలు పాకిస్థానీ పాస్ పోర్టులను దావూద్ పొందాడని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తన నివేదికలో తెలిపింది. కరాచీ నూరాబాద్ లోని ఓ కొండ ప్రాంతంలో దావూద్ కు విలాసవంతమైన బంగళా ఉందని చెప్పింది. ఇండియా, యూఏఈ, స్పెయిన్, మొరాకో, టర్కీ, సైప్రస్, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాల్లో దావూద్ కు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయని తెలిపింది.

భద్రతామండలి ఉగ్రసంస్థల జాబితాలో లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, లష్కర్ ఇ ఝాన్వీ, అల్ అఖ్తర్ ట్రస్ట్, హర్కతుల్ జిహాద్ ఇస్లామీ, తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్, జమాతుల్ అహ్రార్, ఖతీబా ఇమామ్ అల్ బుఖారీ తదితర సంస్థలు ఉన్నాయి. పాకిస్థాన్ నుంచి 139 పేర్లు రావడంతో... అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ మరోసారి దోషిగా నిలబడినట్టైంది. 

More Telugu News