థర్డ్ ఫ్రంట్ మాకు ముఖ్యం కాదు: సీఎం రమేష్

04-04-2018 Wed 15:42
  • రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
  • అవినీతి కేసుల్లో నిందితులా మాకు నీతులు చెప్పేది?
  • కేంద్రంపై పోరాటం విషయంలో ఏ రోజు కార్యాచరణ ఆరోజే 
తమకు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం కన్నా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని టీడీపీ నేత సీఎం రమేష్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, అవినీతి కేసుల్లో నిందితులుగా ఉన్న వారు తమకు నీతులు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై చేస్తున్న పోరాటం విషయంలో ఏ రోజు కార్యాచరణ ఆరోజే ఉంటుందని అన్నారు. ఏపీకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.