Andhra Pradesh: శాసనమండలిలో మంత్రి గంటా, బీజేపీ నేత మాధవ్ మధ్య వాగ్వాదం

  • కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యంపై చర్చ  
  • కేంద్రాన్ని గంటా విమర్శించడంపై మాధవ్ అభ్యంతరం
  • ఈ క్రమంలో నేతల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం

ఏపీలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్న అంశంపై ఏపీ శాసనమండలిలో ఈ రోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు డీపీఆర్ లు తయారు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు.

తాము భూములిచ్చి ప్రహరీగోడలు కట్టించినప్పటికీ ఇంతవరకూ సంస్థల నిర్మాణం చేపట్టలేదని, గిరిజన, సెంట్రల్ యూనివర్శిటీ మంజూరూ చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని గంటా విమర్శించడాన్ని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అభ్యంతరం చెప్పారు. పదేళ్లలో ఇవ్వాల్సిన సంస్థలను నాలుగేళ్లలోనే కేంద్రం ఇచ్చిందని, ఏపీ ప్రభుత్వం స్థలాలు అప్పగించకపోవడం వల్లే కేంద్రం నిధులు మంజూరు చేయలేదని మాధవ్ అన్నారు. దీంతో, గంటా, మాధవ్ మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. 

More Telugu News