Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తొలిసారిగా మలయాళ చిత్రంలో అనుష్క 
  • పెదనాన్న చిత్రంలో నిహారిక కీలక పాత్ర!
  • షూటింగుకి రెడీ అవుతున్న ఎన్టీఆర్
  • చరణ్ కథ నానికి వెళ్లిందట!

 *  అందాల అనుష్క తొలిసారిగా మలయాళ చిత్రంలో నటించనుంది. మమ్ముట్టి హీరోగా శరత్ సందిత్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో అనుష్కను కథానాయికగా తీసుకున్నట్టు తాజా సమాచారం.
*  మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికకు పెదనాన్న చిరంజీవి చిత్రం నుంచి ఓ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా'లో ఓ కీలక పాత్ర నిహారికను వరించినట్టు సమాచారం.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విదితమే. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12 నుంచి జరుగుతుంది.
*  ఒక్కోసారి కొందరు చేయాల్సిన కథలు మరొకరికి వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు నాని చేస్తున్న 'కృష్ణార్జున యుద్ధం' చిత్ర కథ కూడా రామ్ చరణ్ కోసం తయారుచేసిందట. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ కథను చరణ్ కు చెప్పాడని, అయితే ఆయనకు నచ్చకపోవడంతో దీనిని నానితో చేశాడని అంటున్నారు. కాగా, ఈ నెల 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.         

More Telugu News