soudi arebia: సౌదీలో కొత్త చట్టం: జీవిత భాగస్వామి ఫోన్ ని దొంగచాటుగా చూస్తే కటకటాలు లెక్కించాల్సిందే!

  • స్త్రీ సమానత్వం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సౌదీ అరేబియా 
  • పెరిగిపోతున్న విడాకుల కేసుల్లో మొబైల్ డేటా కీలకంగా మారడంతో సరికొత్త చట్టం 
  • ఫోన్ డేటా దొంగతనంగా చూస్తే జైలు శిక్ష, జరిమానా

స్త్రీ సమానత్వం, మహిళ స్వేచ్ఛకు ఊతమిచ్చేలా పలు చట్టాలు చేస్తున్న సౌదీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త యాంటీ సైబర్ క్రైమ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భార్య, భర్త ఎవరైనా తమ జీవిత భాగస్వామి ఫోన్‌ లోని డేటాను దొంగచాటుగా పరిశీలిస్తే దానిని నేరంగా పరిగణిస్తారు.

దీంతో ఈ నేరానికి పాల్పడే వారికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు, 5 లక్షల సౌదీ రియాళ్లు (సుమారు 86.5 లక్షల రూపాయలు) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిపోతున్న విడాకుల కేసుల్లో మొబైల్ డేటా కీలకంగా మారుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.

More Telugu News