somireddy: 21,693 ఎకరాల్లో రూ.56 కోట్లకు పైగా పంట నష్టం : ఏపీ మంత్రి సోమిరెడ్డి

  • అకాల వర్షాలకు వ్యవసాయ, హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి
  • త్వరలో బాధిత రైతులకు నష్టపరిహారం అందజేస్తాం
  • ఈ ఏడాది ఎంఐపీలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది

ఏపీలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల 21,693 ఎకరాల్లో రూ.56 కోట్లకు పైగా విలువైన పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. బాధిత రైతులందరికీ ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో నష్టపరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సీహెచ్.ఆదినారాయణరెడ్డి మాట్లాడారు.

తొలుత సోమిరెడ్డి మాట్లాడుతూ, మార్చి 16 వ తేదీ నుంచి ఈ నెల 2 వ తేదీ వరకూ వడగళ్లతో కూడిన గాలివానల వల్ల 21,693 ఎకరాల్లో వ్యవసాయ, హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయని , దీనివల్ల రూ.56 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అన్నారు. 8 ఎకరాలకు పైగా ఉన్న పంట భూముల్లో రూ.39.5 కోట్ల విలువైన వరి తదితర పంటలు, హార్టికల్చర్ లో సాగవుతున్న 13,424 ఎకరాల్లో రూ.17 కోట్లకు పైగా నష్టం జరిగిందని అన్నారు. ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాల ద్వారా ఏరోజుకారోజు మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని. పూర్తి వివరాలు రాగానే నిబంధనల ప్రకారం బాధిత రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారం అందజేస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఎం.ఐ.పి.లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని, రెండో స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో గుజరాత్ ఉన్నాయని చెప్పారు.  

మొక్కజొన్న, జొన్న 100 క్వింటాళ్లకు రూ.20 వేలు : మంత్రి ఆదినారాయణరెడ్డి

మొక్క జొన్న, జొన్న పంటలకు గిట్టుబాటు ధరలు లేని కారణంగా రైతులకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినట్లు మంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే రైతుల నుంచి వ్యాపారులు మొక్క జొన్న, జొన్న కొనుగోలు చేస్తున్నారని, మార్కెట్ ధర కంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ప్రతి రైతుకూ 100 క్వింటాళ్లకు గానూ రూ.200  చొప్పున రూ.20 వేలు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

More Telugu News