వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డి

03-04-2018 Tue 19:41
  • బీజేపీతో వైసీపీ సంబంధం ఈనాటిది కాదు
  • నాడు 9 మంది ఎంపీలతో కలిసి జగన్ ఢిల్లీలో మోదీని కలిశారు
  • బీజేపీ వెంటే ఉంటామని నాడే చెప్పారు
  • అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నా

బీజేపీతో వైసీపీ సంబంధం ఈనాటిది కాదంటూ ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు ఎన్నికలు ఫలితాలు వచ్చినరోజే 9 మంది ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన జగన్, మోదీని కలిశారని, ఆ సమయంలో తాను వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పారు.

తాము బీజేపీ వెంటే ఉంటామని చెప్పి ఆ పార్టీ నేతలకు జగన్ ఆరోజే చెప్పారని అన్నారు. మిత్రపక్షం శత్రుపక్షమైందని, శత్రుపక్షం మిత్రపక్షమైందనే విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానని అన్నారు. అసెంబ్లీకి, శాసన మండలికి రాకుండా తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, సమావేశాలకు హాజరుకావాలని హితవు పలికారు.