Rajamouli: భగత్ సింగ్ ని ఉరితీసింది ఇక్కడే ! : దర్శకుడు రాజమౌళి

  • లాహోర్ లోని షాద్మన్ చౌక్ ప్రాంతం ఇది 
  • ఈ ప్రాంతాన్ని చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి
  • ఓ ట్వీట్ చేసిన రాజమౌళి

భారత దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన సర్దార్ భగత్ సింగ్ ను దర్శకుడు రాజమౌళి గుర్తుచేసుకున్నారు. పాకిస్థాన్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రాజమౌళి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాకిస్థాన్ లో పర్యటించిన రాజమౌళి ఓ ట్వీట్ చేశారు.

‘నాడు బ్రిటిష్ వాళ్లు భగత్ సింగ్ ను ఉరితీసిన లాహోర్ లోని షాద్మన్ చౌక్ ప్రాంతం ఇది .. ఈ ప్రాంతాన్ని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి’ అని తన ట్వీట్ లో పేర్కొన్న రాజమౌళి, ఓ ఫొటోను పోస్ట్ చేశారు. కాగా, 1931 మార్చి 23న బ్రిటిష్ హై కమిషనర్ సాండర్స్ ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్ సింగ్ తో పాటు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను లాహోర్ లో ఉరి తీశారు. 

More Telugu News