Honda: బోల్టులో లోపం.. యాక్టివా, గ్రాజియా, ఏవియేటర్ స్కూటర్లు రీకాల్

  • స్కూటర్లలో చిన్నపాటి లోపాన్ని గుర్తించిన హోండా
  • మొత్తం 56,194 వాహనాలను వెనక్కి పిలిపించాలని నిర్ణయం
  • వినియోగదారులకు సమాచారం చేరవేస్తున్న డీలర్లు

తమ స్కూటర్లలో చిన్న లోపాన్ని గుర్తించిన ద్విచక్ర వాహనాల ఉత్పత్తి సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 56,194 వాహనాలను రీకాల్ చేయాలని నిర్ణయించింది. ఆ సంస్థ విడుదల చేసిన యాక్టివా 125, గ్రాజియా, ఏవియేటర్ స్కూటర్లలోని ఫ్రంట్ ఫోర్క్ వద్ద బిగించిన ఓ బోల్ట్‌లో లోపం ఉన్నట్టు గుర్తించిన సంస్థ వీటిని వెనక్కి పిలిపించాలని నిర్ణయించింది. వెనక్కి పిలిపించిన అనంతరం వాటిని పరిశీలించి అవసరమైతే బోల్టును మారుస్తామని హోండా తెలిపింది.

హోండా డీలర్లు ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పి స్కూటర్లను వెనక్కి తెప్పించనున్నారు. బోల్టు బిగింపు సందర్భంగా వినియోగదారుల నుంచి అదనంగా ఎటువంటి రుసుము వసూలు చేయబోమని సంస్థ పేర్కొంది. హోండా విక్రయాల్లో లోపాలు గుర్తించిన ఈ మూడు మోడళ్లే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. యాక్టివా చాలా ఏళ్ల క్రితమే మార్కెట్లోకి రాగా, గ్రాజియా గతేడాది మార్కెట్లోకి వచ్చింది.

More Telugu News